Current Affairs Telugu Daily

కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు
 2018 జులై 4న డిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడి నేతృత్వంలో  కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశం నిర్వహించారు.
  • ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం 2018-19 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 14 పంటల కనీస మద్దతు ధరను ప్రకటించింది.
  • ధాన్యం మద్దతు ధర క్వింటాలకు రూ.200 పెరిగింది. యూపీఏ-2 ప్రభుత్వం హయాం (2012-13)లో క్వింటాలుకు రూ.170 పెంచడమే రికార్డుగా ఉండేది.
  • ఇప్పుడు దాన్ని అధిగమించింది. ప్రస్తుత ఎన్‌డీఏ పాలనలో గత నాలుగేళ్లలో క్వింటాలుకు రూ.50-80న పెరిగింది.
  • క్వింటాలు ధాన్యం ఉత్పత్తికి రూ.1,166 ఖర్చవుతుందని అంచనా వేసి, దానిపై 50 శాతం ఆదాయం వచ్చేలా రూ.1,750ని మద్దతు ధరగా ప్రకటించింది.
  • రాగుకు 50% ధర పెరిగింది. మిగతా అన్నిపంటల ధర వృద్ధి 50%లోపే ఉంది. తెలుగురాష్ట్రాల్లో ప్రధానపంట అయిన వరి ధర గత ఏడాదికంటే కేవలం 12.90% మాత్రమే పెరిగింది.
  • కంది 4.13%, మినుము 3.70%, వేరుశనగ 9.87%, పత్తి 28% మాత్రమే పెరిగాయి. పెట్టుబడిని లెక్కించి, దానిపై 50% పెంచి ధరల నిర్ణయించామని చెప్పినప్పటికీ, గత ఏడాది ధరతో పోలిస్తే పంట ధరల్లో అత్యల్ప మార్పు మాత్రమే కనిపించింది.
మద్దతు ధరలు
వరి (సాధారణ)    రూ.1,750
వరి (గ్రేడ్‌ ఎ)    రూ.1,770
రాగులు    రూ.2,897
కందులు    రూ.5,675
పెసలు    రూ.6,975
వేరుసెనగ    రూ.4,890
పత్తి (పొడవు పింజ)    రూ.5,450
మొక్కజొన్న (హైబ్రిడ్‌)    రూ.2,430
  • ఉన్నత విద్య ఆర్థిక సంస్థ (HEFA) అధీకృత మూలధనాన్ని రూ.2వేల కోట్ల నుంచి రూ.10వేల కోట్లకు పెంపు.
  • 2022 నాటికి ఈ సంస్థ విద్యా వ్యవస్థ పునరుత్తేజ పథకం (రీవిటలైజింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ సిస్టమ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌-రైజ్‌) అమలుకు రూ.లక్షల కోట్ల నిధులను సమీకరించనుంది.
  • ఈ పథకం కింద విద్యాసంస్థకు గ్రాంట్లతో పాటు రుణం కూడా లభిస్తుంది. ఆయా సంస్థలు సొంతంగా నిధులు సమకూర్చుకొని ఈ రుణాలను తీర్చాల్సి ఉంటుంది. 
  • డీఎన్‌ఏ సాంకేతిక పరిజ్ఞానం (ఉపయోగం, వినియోగం) నియంత్రణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం. కేసు దర్యాప్తు, న్యాయ వ్యవస్థను పటిష్ఠపరచడం కోసం ఈ నిర్ణయం తీసుకొంది.
  • ఇందులో భాగంగా నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయనుంది. ఇది డీఎన్‌ఎ ప్రయోగశాల ప్రమాణాలను నిర్ణయిస్తుంది.
  • డీఎన్‌ఏ వివరాలను భద్రపరచడానికి డీఎన్‌ఏ బ్యాంకును ఏర్పాటు చేయనుంది. అక్రమంగా డీఎన్‌ఏ వివరాలను సేకరించే వారికి 3 సం॥ల జైలు శిక్ష, రూ.లక్షల జరిమనా విధించనుంది. 
  • ప్రపంచ మేధో హక్కు సంస్థ (వరల్డ్‌ ఇంటలెక్చుయల్‌ ప్రాపర్టీ ఆర్గనైజేషన్‌-WIPO) కాపీరైట్‌ ఒప్పందానికి ఆమోదం. ఇంటర్నెట్‌, డిజిటల్‌ సమాచారానికి ఇది రక్షణ కల్పించనుంది. 
  • వీవీఐపీలు ప్రయాణించే విమానాల వార్షిక నిర్వహణ ఖర్చులను మరో రూ.200 కోట్లకు పెంపు. ఇంతవరకు ఈ పద్దుకు రూ.336.24 కోట్లు కేటాయిస్తుండగా, వివిధ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొంది. 
  • శరణార్ధులు, వలసవచ్చిన వారి సంక్షేమం కోసం ప్రస్తుతం అమలు చేస్తున్న ఎనిమిది పథకాలను కొనసాగించాలని నిర్ణయం
HEFA-Higher Education Financing Agency
RISE-Revitalising Infrastructure and Systems in Education
WIPO-World Intellectual Property Organization

views: 925



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams