Current Affairs Telugu Daily

ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు : కేంద్రం
14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.
  • ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు  ప్రత్యేక ఆర్థిక సాయం చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.
  • 2015-2020 సంవత్సరాల్లో విదేశీ ఆర్థిక సంస్థ రుణం రూపంలో సాయం చేస్తామని ప్రకటించినట్లు తెలిపింది.
  • ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం అమలులో కేంద్రప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన కేసులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ఆర్థికశాఖ అఫిడవిట్‌ దాఖలు చేసింది.
  • జూన్‌ 29వ తేదీతో దాఖలు చేసిన ఈ ప్రమాణపత్రంలో కేంద్రం ఈ విషయాన్ని పునరుద్ఘాటించింది. 
  • పోలవరం ప్రాజెక్టును బచావత్‌ అవార్డుకి లోబడే నిర్మిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్ర జలవనరుల శాఖ ప్రమాణపత్రం దాఖలు చేసింది.
  • తెలుగు రాష్ట్రాల్లోని నదీ జలాల నిర్వహణ నిమిత్తం కృష్ణా, గోదావరి, తుంగభద్ర బోర్డు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
  • కృష్ణా, గోదావరి బోర్డు పరిధిపై ప్రకటన ఇచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య  ఏకాభిప్రాయం రాలేదంటూ ఆయా బోర్డు తాజా పరిస్థితిని ప్రమాణపత్రంలో వివరించింది.
  • పోలవరం ప్రాజెక్టుకి సంబధించి తెలంగాణలోని 324 రెవెన్యూ గ్రామాలు ఏపీలో కలిపామని తెలిపింది. డ్యాం వల్ల భద్రాచలం పట్టణం, భదాద్రి ఆయం నీట మునగవని స్పష్టం చేసింది.
  • డ్యాం ఎత్తు 45.72 మీటర్లు కాగా భద్రాచలం పట్టణం 55మీటర్లు, ఆలయం 62 మీటర్ల ఎత్తులో ఉన్నాయని తెలిపింది.
  • గత ఎనిమిదేళ్ల లెక్క ప్రకారం వరద గరిష్ఠంగా 25వేల క్యూమెక్కులు నుంచి 50వేల క్యూమెక్కులు మించలేదని, వరద కారణంగా పట్టణం, ఆలయం నీట మునగవని వివరించింది.
  • సింగరేణి కోల్‌ మైన్స్‌ సరాసరి ఎత్తు 75 మీటర్లు కాగా మణుగూరు హెవీ వాటర్‌ ప్లాంటు ఎత్తు 70మీటర్లు అని, ఇవి రెండు డ్యాం కన్నా ఎక్కువ ఎత్తులో ఉన్నాయని తెలిపింది.
  • 2013 చట్టం ప్రకారం పునరావాసం, పరిహారం కల్పిస్తున్నామని పేర్కొంది. రిజర్వాయరు పూర్తి సామర్థ్యం 150 అడుగుల ఎత్తుకి కేంద్ర జలసంఘం అనుమతించిందని తెలిపింది.
  • ముంపు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించామని, గిరిజనుల పూర్వం ఎలాంటి రక్షణ పొందారో పునరావాస ప్రాంతాల్లోనూ అదే రక్షణ పొందుతారని తెలిపింది.

views: 845

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams