Current Affairs Telugu Daily

లిమ్కా రికార్డుల్లో హైద‌రాబాద్ మెట్రో
ఆరంభానికి ముందే ట్రయల్‌ దశలోనే మెట్రో రైలుపై ప్రకటనలకు ఒప్పందం చేసుకున్న మొట్టమొదటి మెట్రో . 2014 జులై 22న వీరిటైల్‌ ప్రైవేటు లిమిటెడ్‌తో ఎల్‌ అండ్‌ టీ మెట్రో సంస్థ ఒప్పందం చేసుకుంది. ట్రయల్‌ రన్స్‌లో మొదటి రైలు మూడు కోచ్‌లపై పాదరక్షల బ్రాండ్‌ ప్రకటనలతో ఆ ఏడాది ఆగస్టు 7 నుంచి నవంబరు 14 వరకు నాగోల్‌ నుంచి మెట్టుగూడ 8 కి.మీ. మార్గంలో తిప్పారు. అప్పట్లో ఇదో రికార్డు. దీనికి లిమ్కాబుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో తాజాగా చోటు దక్కింది. 
అన్ని మెట్రో స్టేషన్లలో శీతలపానీయాలను ఒకే సంస్థ విక్రయించే ఒప్పందాన్ని ఎల్‌ అండ్‌ టీ మెట్రో చేసుకుంది. 2015 సెప్టెంబరు 11న హిందుస్థాన్‌ కోకాకోలా బేవరేజస్‌తో ఒప్పందం కుదిరింది. మెట్రో పరుగులు మొదలుపెట్టిన తర్వాత మొదటి ఏడేళ్లపాటూ వీరి ఉత్పత్తులనే స్టేషన్లలో విక్రయిస్తారు. 
నిర్మాణ దశలోనే ప్రసార హక్కులపై సంతకాలు చేసింది. అన్ని మెట్రోస్టేషన్లలో శ్రేయాస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌కు ప్రసార హక్కులను కల్పించింది. 2015 జనవరి 29న ఆ మేరకు ఒప్పందం జరిగింది. ఐదేళ్లపాటూ ఇది అమల్లో ఉంటుంది.

views: 899

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams