Current Affairs Telugu Daily

విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌లో హోంగార్డులకు ప్రమాద బీమా సౌకర్యం 
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డుకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ డి.గౌతం సవాంగ్‌ నిర్ణయం తీసుకున్నారు.
  • 2018 జులై 3న విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ఛాంబర్‌లో జరిగిన కార్యక్రమంలో యాక్సిస్‌ బ్యాంకు సర్కిల్‌ హెడ్‌ వి.రామకృష్ణ, సీపీ గౌతం సవాంగ్‌ ప్రమాద బీమాకు సంబందించిన ఒప్పంద పత్రాలపై సంతకాలుచేశారు.
  • ఈ పథకం ద్వారా విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌లో పని చేస్తున్న హోంగార్డులకు ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా కింద రూ.30 లక్షల వరకు చెల్లించనున్నారు.
  • ఉచిత విద్య బీమా భద్రత కింద హోంగార్డు చనిపోతే వారి పిల్లలకు ట్యూషన్‌ ఫీజు చెల్లిస్తారు.

views: 909

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams