Current Affairs Telugu Daily

ఉగాండాలో సోషల్‌ మీడియా పన్ను 
ఉగాండా ప్రభుత్వం 2018 జులై 1న అధికారికంగా సోషల్‌ మీడియా ట్యాక్స్‌ను విధించడం ప్రారంభించింది.
  • జులై 1 నుంచి వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, స్కైప్‌ వంటి సోషల్‌ మాధ్యమాలను వినియోగించడానికి రోజుకు 200 ఉగాండా షిల్లింగ్స్‌ను చెల్లించాలి.
  • దేశంలోని యువతను అదుపు చేసేందుకు ఉగాండా ప్రభుత్వం ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించడం కొత్తేమి కాదు.
  • 2016లో ఆ దేశ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఎన్నిక సందర్భంగా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేసింది.
  • సోషల్‌ మీడియా వల్ల దేశ ఆదాయం, సమయం వృథా అవుతోందని దేశాధ్యక్షుడు యోవేరి ముసెవేని ఫిర్యాదు చేశారు.
  • దీంతో ఈ ఏడాది సోషల్‌ మీడియా పన్నులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ సూచించింది.
  • అమల్లోకి వచ్చిన పన్నులను ఎలా చెల్లించాలనే దానిపై ఎంటీఎన్‌, ఎయిర్‌టెల్‌, ఆఫ్రిసెల్‌లు సంయుక్తంగా ప్రకటనలను విడుదల చేశాయి.
  • ప్రపంచబ్యాంకు లెక్క ప్రకారం ఉగాండాలో 22 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు.

views: 870

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams