Current Affairs Telugu Daily

క్రమసూత్ర పద్ధతి ‘మచీనా’తో క్యాన్సర్‌ వ్యాప్తి నిర్ధారణ
శరీరంలో ప్రమాదకర క్యాన్సర్‌ కణాల వ్యాప్తిని కచ్చితత్వంతో గుర్తించేందుకు వీలుగా అమెరికాలోని ప్రిన్స్‌టన్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు సరికొత్త గణన విధానాన్ని ఆవిష్కరించారు. వ్యాధి ముదరకుండా అడ్డుకట్ట వేసే చికిత్సను అభివృద్ధి చేసేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
  • ‘మచీనా(మెటాస్టాటిక్‌ అండ్‌ క్లోనల్‌ హిస్టరీ ఇంటిగ్రేటివ్‌ అనలైసిస్‌)’గా పిలుస్తున్న ఈ క్రమసూత్ర పద్ధతి డీఎన్‌ఏ అనుక్రమణం(సీక్వెన్సింగ్‌) ద్వారా లభించిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా క్యాన్సర్‌ కణాల వ్యాప్తిని గుర్తిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
  • ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఇతర విధానాలతో పోలిస్తే ‘మచీనా’తో శరీరంలో క్యాన్సర్‌ విస్తరణను స్పష్టంగా తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు.
MACHINA - Metastatic And Clonal History Integrative Analysis

views: 938



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams