Current Affairs Telugu Daily

దేశంలో 19,569 మాతృభాషలు, మాండలికాలు 
భారతదేశంలో 19,569  భాషలు లేదా మాండలికాల్లో మాట్లాడుతున్నట్లు జనాభా లెక్కలపై విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
  • 2011 జనాభా లెక్కలకు సంబంధించిన ఈ వివరాలను రిజిస్ట్రార్‌ జనరల్‌ అండ్‌ సెన్సస్‌ కమిషనర్‌ వెల్లడించారు.
  • ఒక ఇంట్లో మాతృభాషు భిన్నరీతిలో ఉండే అవకాశం ఉన్నందువల్ల.. ప్రతి ఒక్కరినీ ఆరా తీయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
  • మొత్తం జనాభాలో 10వేలు లేదా అంతకన్నా ఎక్కువ మంది మాట్లాడే భాషలు 121 మేర ఉన్నాయి. 
  • దేశ జనాభాలోని 96.71 శాతం మంది 8వ షెడ్యూల్‌లోని 22 భాషల్లోని ఏదో ఒకదానిని మాతృభాషగా కలిగి ఉన్నారు. 
  • మొత్తం మీద 19,569 మాతృ భాషలు, మాండలికాలు ఉన్నట్లు వెల్లడైంది. వీటిలో 1369ను హేతుబద్దీకరించిన మాతృభాషలుగా గుర్తించారు.
  • 1474 భాషలను  వర్గీకరణలో లేనివిగా ప్రకటించారు. వీటిని ఇతర మాతృ భాషల విభాగంలో చేర్చారు.
  • షెడ్యూల్‌లో లేని భాషలు  2001లో 100 ఉండగా 2011లో అవి 99కి తగ్గాయి. సిమ్టే, పెర్షియన్‌ భాషలను మాట్లాడేవారు గణనీయ స్థాయిలో లేకపోవడంతో వాటిని తొలగించారు. మావో అనే భాషలను చేర్చారు. 
  • రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో తెలుగు, తమిళం, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కశ్మీరీ, కొంకణీ, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, సంస్కృతం, సింధీ, ఉర్దూ, బోడో, సంథాలీ, మైథిలీ, డోగ్రీ భాషలు ఉన్నాయి.

views: 963

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams