Current Affairs Telugu Daily

తెలంగాణలోని 15 జిల్లాల్లో 30 ‘గోబర్‌-ధాన్‌’ ప్లాంట్లు 
గ్రామాల్లోని పశువుల విసర్జితాలు, ఇళ్ల నుంచి వచ్చే చెత్త, పొలాల్లోని వ్యర్థాల నుంచి సేంద్రీయ ఎరువులు, బయోగ్యాస్‌, విద్యుత్‌ తయారు చేసి సంపదను సృష్టించటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘గోబర్‌-ధాన్‌’ అనే కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.
  • దీని కింద తెలంగాణలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30 కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది.
  • దేశవ్యాప్తంగా ప్రతి రోజూ గ్రామాల్లో 5,257 టన్నుల పశువు వ్యర్థాలు, పొలాల్లో పంటను కోసిన తర్వాత మిగిలే వ్యర్ధాలు 62 కోట్ల టన్నులు ఉంటున్నాయి.
  • దాదాపు 10 కోట్ల టన్ను వ్యర్థాలను పొలాల్లోనే తగలబెడుతుంటారు. పశువు, వ్యవసాయ వ్యర్థాలను ఎండపెట్టి వంటకు ఉపయోగించేటప్పుడు వెలువడే కాలుష్యానికి దేశంలో ఏటా 5లక్షల మంది మృత్యువాత పడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా.
  • ఈ సమస్యకు పరిష్కారంగానే కేంద్ర ప్రభుత్వం గోబర్‌-ధాన్‌కు రూపకల్పన చేసింది.
  • దేశవ్యాప్తంగా 2018-19లో రెండు దశల్లో 700 ప్లాంటును చేపట్టాలని నిర్ణయించగా వాటిలో తెలంగాణకు 30 మంజూరయ్యాయి.
  • ఇళ్లలోని చెత్త, పశువుల విసర్జితాను సేకరించటం,  ప్లాంటు నిర్వహణ వంటి పనులను గ్రామాల్లోని స్వయం సహాయక బృందాలు చేపడతాయి.
  • ప్లాంటులో ఉత్పత్తయ్యే బయోగ్యాస్‌, సేంద్రీయ ఎరువు, విద్యుత్‌ను గ్రామస్థుల అవసరాలకు వినియోగిస్తారు.
  • వ్యర్థాలను సమకూర్చే వారికి గ్రామసభ నిర్ణయించిన ధర చెల్లిస్తారు. లేదా ప్లాంటులోని ఉత్పత్తులను ఇస్తారు.
  • బయోగ్యాస్‌ను ఇంటింటికీ ఇవ్వటం సాధ్యం కాకుంటే సామాజిక వంట గదిని ఏర్పాటు చేసి అక్కడికి గ్యాస్‌ను సరఫరా చేస్తారు.
  • అంటే గృహిణులు అక్కడికి వెళ్లి వంట చేసుకోవచ్చు. ప్లాంటును ఏర్పాటు చేయటానికి ఎంపిక  చేసే గ్రామం ఇప్పటికే ఓడీఎఫ్‌ గుర్తింపు పొంది, తగిన ఆదాయ వనరులు, ప్లాంటుకు కావాల్సిన భూమిని కలిగి ఉండాలి.
  • నేరుగా కంపెనీలే ఇటువంటి ప్రాజెక్టును ఏర్పాటు చేయతపెడితే వాటికి రాయితీలు ఉండవు. అవి ఉత్పత్తును విక్రయించుకోవచ్చు.
  • తెలంగాణలోని ప్లాంట్లకు అయిదేళ్లపాటు టాటా ట్రస్టు నిపుణులు సహకారాన్ని తీసుకోవాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది.
  • కేంద్రాల ఏర్పాటుకు స్వచ్ఛభారత్‌ కింద నిధులు లభిస్తాయి. గ్రామంలోని ఇళ్ల సంఖ్య ఆధారంగా నిధుల అందుతాయి.
  • 150 గృహాలు ఉంటే రూ.7లక్షలు, 500 ఉంటే రూ.20లక్షలు మంజూరవుతాయి. రాయితీ నిధుల్లో కేంద్ర, రాష్ట్రా వాటాలు 60:40 నిష్పత్తిలో ఉంటాయి.
  • మిగతా మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వం ముద్ర తదితర పథకాల ద్వారా రుణంగా అందజేయాలి.

views: 1050

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams