Current Affairs Telugu Daily

కూచిపూడి నర్తకీమణి అచ్యుత మానసకు యునెస్కో ఆహ్వానం 
విజయవాడకు చెందిన కూచిపూడి నర్తకీమణి అచ్యుత మానసకు యునెస్కో అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్‌ డ్యాన్స్‌ కౌన్సిల్‌ నుంచి ఆహ్వానం అందింది.
  • 2018 జులై 4 నుంచి 8 వరకు గ్రీస్‌లోని ఏథెన్స్‌లో జరుగనున్న 51వ అంతర్జాతీయ నృత్య సమ్మేళనంలో అచ్యుత మానస ప్రదర్శన ఇవ్వనున్నారు.
  • ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన సుమారు 400 మంది శాస్త్రీయ నృత్య కళాకారులు హాజరుకానున్న ఈ వేడుకల్లో కూచిపూడి నృత్య ప్రదర్శన చేయడానికి ఆహ్వానం అందుకున్న తొలి తెలుగు అమ్మాయి(తెలుగు రాష్ట్రాల్లో) మానస.  
  • నృత్య ప్రదర్శనతో పాటు కూచిపూడి నృత్య విశేషాతో కూడిన ఛాయాచిత్ర ప్రదర్శన, ‘కూచిపూడి నృత్యంలో తరంగం’ అంశంపై సెమినార్‌ కూడా ఆమె నిర్వహించనున్నారు. 

views: 979



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams