Current Affairs Telugu Daily

రాష్ట్ర, జిల్లా స్థాయి గణాంకాలపై రవీంద్ర హెచ్‌ ధొలాకియా కమిటీ
రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఆర్థిక గణాంకాల సేకరణకు అనుసరించాల్సిన ప్రామాణికాలను గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం 13 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.
  • స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) లెక్కింపునకు ప్రస్తుతం అనుసరిస్తున్న ఆధారిత సంవత్సరాన్ని మార్చడం కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో అమలు చేస్తున్న ప్రామాణికాలను కూడా సవరించాల్సి ఉంది.
  • 2011-12వ సంవత్సరాన్ని ఆధారంగా చేసుకొని ప్రస్తుతం జీడీపీని లెక్కిస్తుండగా, మారిన పరిస్థితులకు అనుగుణంగా 2017-18ను ఆధారంగా చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
  • దీనిపై తగిన సూచను ఇవ్వడానికి ఐఐఎం-అహ్మదాబాద్‌కు చెందిన రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ రవీంద్ర హెచ్‌ ధొలాకియా ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది.
  • రాష్ట్ర స్థూల ఉత్పత్తి(ఎస్‌డీపీ), జిల్లా స్థూల ఉత్పత్తుల (డీడీపీ) లెక్కింపునకు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి? వాటిని ఏ విధంగా వర్గీకరించాలి? ఇందుకోసం ఏయే మార్గదర్శకాలను సవరించాలి? తదితర అంశాలను అధ్యయనం చేసి ఏడాదిలోగా నివేదిక సమర్పించాలని సూచించింది.
GDP-Gross Domestic Product

views: 831

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams