Current Affairs Telugu Daily

UNESCO వారసత్వ కట్టడాల జాబితాలో ముంబయి భవన సముదాయాలు
ముంబైలోని విక్టోరియన్‌ గోథిక్‌(19వ శతాబ్దం), ఆర్ట్‌ డెకో(20వ శతాబ్దం) నిర్మాణ శైలుల్లో నిర్మించిన కట్టడాలకు యునెస్కో ప్రపంచ చారిత్రక కట్టడాల జాబితాలో స్థానం దక్కింది.
  • ముంబయిలోని విక్టోరియన్‌ గోథిక్‌, ఆర్ట్‌డెకో తరహా వాస్తునిర్మాణ శైలిని అద్భుతంగా ప్రతిబింబించే పాత సచివాలయం(1857-74), యూనివర్సిటీ లైబ్రరీ, కన్వెన్షన్‌ హాల్‌(1874-78), బాంబే హైకోర్టు(1878), ప్రజాపనుల శాఖ కార్యాలయం(1872),   వాట్సన్స్‌ హోటల్‌(1869), డేవిడ్‌ ససూన్‌ లైబ్రరీ(1870), ఎల్ఫిస్టోన్‌ కళాశాల(1880) తదితర భవన సముదాయాలకు ఈ ఏడాది యునెస్కో గుర్తింపు లభించింది.
  • ఇప్పటికే ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ రైల్వే స్టేషన్‌(2004), ఎలిఫెంటా గుహు(1987) ఈ జాబితాలో ఉన్నాయి.
  • బెహరైన్‌లోని మనామాలో 2018 జూన్‌ 30న జరిగిన యునెస్కో ప్రపంచ చారిత్రక కమిటీ(WHC) 42వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 
  • ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్‌ అభా నారాయణ్‌ లాంబా విక్టోరియన్‌ గోథిక్‌, ఆర్ట్‌ డెకో కట్టడాలకు సంబంధించిన చారిత్రక వివరాలను, గొప్పదనాన్ని రూపొందించి యునెస్కోకు నామినేషన్‌గా పంపారు.
  • జాబితాలో ఈ 2 కట్టడాలకు చోటు దక్కడం భారత్‌కు, ముంబైకి దక్కిన గౌరవంగా ఆమె పేర్కొన్నారు. జాబితా రూపకల్పన సమయంలో WHCలోని 21 సభ్యదేశాలు ఏకగ్రీవంగా ఈ రెండు కట్టడాకు ఓటు వేశాయి.
  • ఈ నిర్ణయంతో భారత్‌లో ఉన్న WHC కట్టడాల సంఖ్య 37కు చేరింది.
UNESCO-United Nations Educational, Scientific and Cultural Organization 
UNESCO అధిపతి - ఆడ్రే అజౌలే
UNESCO  ప్రధాన కార్యాలయం - పారిస్‌, ఫ్రాన్స్‌
WHC-World Heritage Committee

views: 1141

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams