స్మార్ట్ ఇండియా హ్యాకథాన్-2018లో కె.సి.జి. కళాశాలకు ప్రథమ స్థానం
స్మార్ట్ ఇండియా హ్యాకథాన్-2018 పోటీల్లో చెన్నైకు చెందిన కె.సి.జి. ఇంజినీరింగ్ కళాశాల బృందం ప్రథమ స్థానంలో నిలిచి రూ.లక్ష నగదు పురస్కారాన్ని, ట్రోఫీని దక్కించుకొంది.
చదవడం, రాయడాన్ని త్వరగా ఆకళింపు చేసుకోలేని విద్యార్థుల కోసం ఒక బోధన పద్ధతిని ఈ కళాశాలకు చెందిన ఈసీఈ విభాగం విద్యార్థులు రూపొందించారు.
ఇలాంటి సమస్యతో దేశంలో దాదాపు 3.5 కోట్ల మంది చిన్నారులు ఉంటారని అంచనా.
పదాలతో ఆటలాడుకుంటూనే 5-14 ఏళ్ల పిల్లలు సుభంగా వాటిని నేర్చుకునేందుకు ఈ పద్ధతి ఉపకరిస్తుంది.
తుది పోటీల్లో పాల్గొన్న 106 బృందాల నుంచి ఈ నమూనా ఎంపికయింది. దేశంలో 10 చోట్ల నిర్వహించిన పోటీల్లో దాదాపు 50 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు.