Current Affairs Telugu Daily

అందుబాటులోకి UIDAI వర్చ్యువల్‌ ఐ.డి
గుర్తింపు సంబంధిత అవసరాల నిమిత్తం వాస్తవమైన ఆధార్‌ సంఖ్యను చెప్పాల్సిన అవసరం లేకుండా ఎవరికి వారు ఒక అంకెను వెబ్‌సైట్‌ ద్వారా సృష్టించుకునేందుకు వీలు కల్పించే (వర్చ్యువల్‌ ఐ.డి-VID) వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.
  • వివిధ అధీకృత సంస్థన్నీ దీనిని వాడుకునేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌లో మార్పు చేసుకోవాని, బ్యాంకులకు మాత్రం దీని నిమిత్తం ఆగస్టు 31 వరకు గడువు ఉంటుందని భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) 2018 జూన్‌ 30న వెల్లడించింది.
  • వాస్తవమైన 12 సంఖ్యల అంకెను పంచుకోవాల్సిన అవసరం లేకుండా ఈ కాల్పనిక సంఖ్యను తెలియజేస్తే దాని ఆధారంగా వివరాలను సరిపోల్చుకునే వెసులుబాటును అందుబాటులోకి తెస్తామని ఉడాయ్‌ 2018 జనవరిలో ప్రకటించింది.
  • సమాచార గోప్యతపై వ్యక్తమవుతున్న ఆందోళన నేపథ్యంలో దీనిని తీసుకువచ్చింది. కొత్త VIDకి అనుగుణమైన సాఫ్ట్‌వేర్‌ ఉన్న అధీకృత వినియోగ సంస్థన్నీ కొత్త సదుపాయాన్ని పొందే వీలుంది.
  • VIDకి మారని సంస్థలకు 2018 జులై 1 నుంచి ప్రతీ లావాదేవీకి 20 పైసులు చొప్పున రుసుం వడ్డిస్తామని ఉడాయ్‌ తెలిపింది. 2018 జులై 31లోగా వారు పూర్తిస్థాయిలో కొత్త వ్యవస్థకు మారినట్లయితే అంతవరకు వాటికి విధించిన లావాదేవీ రుసుమును పూర్తిగా రద్దు చేస్తామని వివరించింది.
  • వీఐడీకి 2018 ఆగస్టు 31లోగా పూర్తిస్థాయిలో మారని సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. వీఐడీ అన్నివిధాలా సిద్ధమయ్యాక- ప్రజలు తమ ఆధార్‌ సంఖ్యను చెప్పాల్సిన అవసరం లేకుండా 16 అంకెలు కాల్పనిక సంఖ్యను ఉటంకిస్తే సరిపోతుందని పేర్కొంది.
  • ఎవరు ఎన్నిసార్లైనా ఈ సంఖ్యను సృష్టించుకోవచ్చని, కొత్తది రాగానే పాతది దానంతట అదే రద్దయిపోతుందని తెలిపింది.
ఆధార్‌ను 2009 జనవరి 28న ప్రారంభించారు
UIDAI-Unique Identification Authority of India
VID -Virtual ID
UIDAI ఛైర్మన్‌ - జె.సత్యనారాయణ
UIDAI సీఈఓ - అజయ్‌భూషణ్‌ పాండే

views: 793

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams