Current Affairs Telugu Daily

వస్తువులను మాయం చేసే నూతన సాంకేతికత స్పెక్ట్రల్‌ ఇన్‌విజిబిలిటీ క్లోక్‌ 
వస్తువులను మాయం చేసే నూతన సాంకేతికతను అమెరికా  శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కాంతి గురించి అధ్యయనం చేసే ది ఆప్టిక్‌ సొసైటీ కంపెనీ స్పెక్ట్రల్‌ ఇన్‌విజిబిలిటీ క్లోక్‌  అనే కొత్త పరికరాన్ని అభివృద్ధి చేసింది.
  • ఈ పరికరంతో ఏ వస్తువునైనా కనిపించకుండా చేయొచ్చు. ఈ పరికరం కాంతి పౌనఃపున్యాన్ని మారుస్తుంది.  
  • ఇప్పటి వరకు ఒకే రంగు కాంతి వచ్చే వస్తువులను మాత్రమే మాయం చేసే సాంకేతికత ఉంది.
  • తాజాగా అభివృద్ధి పరిచిన సాంకేతికతతో అన్ని రంగులున్న వస్తువులను కూడా మాయం చేయగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
  • ఈ వివరాలు ఆప్టికా అనే జర్నల్‌లో ప్రచురితమ య్యాయి. 

views: 1357

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams