Current Affairs Telugu Daily

17 స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వ నిధులు
రాష్ట్రంలోని 17 స్వచ్ఛంద సంస్థలకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
  • 2018 జూన్‌ 28న సచివాయలంలో సీఎస్‌ ఎస్‌కే జోషి అధ్యక్షతన జరిగిన సాంఘిక సంక్షేమ నిధి రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
  • 2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాలకు గాను 9 జిల్లాల్లోని స్వచ్ఛంద సంస్థకు ఈ నిధులు అందించనున్నారు. అనాథ బాలలు, వృద్ధాశ్రమాలు, బుద్ధిమాంధ్య పిల్లలకు సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు 50% ఇచ్చే గ్రాంట్‌ను 75 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
  • నిధులు పొందిన స్వచ్ఛంద సంస్థల్లో రంగారెడ్డి జిల్లాలో 5, నల్లగొండలో 3, మేడ్చల్‌ 2 తో పాటు నాగర్‌ కర్నూల్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన సంస్థలున్నాయి.

views: 1149

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams