Current Affairs Telugu Daily

‘గ్రామ్‌ పరివాహన్‌ యోజన’కు ఆగస్టు 15న శ్రీకారం
గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు స్వయం సహాయక బృందాలకు ఆర్థిక చేయూతను అందించేందుకు ఉద్దేశించిన పథకానికి ‘ప్రధానమంత్రి గ్రామ్‌ పరివాహన్‌ యోజన’ అనే పేరు ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఇదో విప్లవాత్మక పథకంగా నిలిచిపోతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమార్‌ తెలిపారు. 250 బ్లాకుల్లో 1500 వాణిజ్య వాహనాలను ప్రయాణికుల కోసం నడిపేందుకు వీలుగా ఒక్కో బృందానికి గరిష్ఠంగా రూ.6 లక్షలు వడ్డీలేని రుణాలను మంజూరు చేస్తామనీ, ఆరేళ్లలో దానిని తీర్చాల్సి ఉంటుందనీ తెలిపారు. రుణం తీరిపోయాక ఒక్కొక్కరు నెలకు రూ.6000- రూ.9000 వరకు ఆర్జించే అవకాశం ఉంటుందన్నారు.
views: 869

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams