Current Affairs Telugu Daily

మార్కెట్‌ విలువ భారీగా పెరిగిన సంస్థల్లో అమెజాన్‌కు తొలి స్థానం
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి 100 సంస్థల మార్కెట్‌ విలువ 20 లక్షల కోట్ల డాలర్ల (దాదాపు రూ.1360 లక్షల కోట్లు) స్థాయికి చేరిందని పీడబ్ల్యుసీ సర్వేలో తేలింది.
  • గత ఏడాదితో పోలిస్తే మార్కెట్‌ విలువ 15% పెరిగిందని, ఈ 100 కంపెనీల్లో 54 అమెరికాకు చెందినవేనని నివేదిక వెల్లడించింది.
  • పీడబ్ల్యుసీ గ్లోబల్‌ టాప్‌-100 ర్యాంకుల్ని 2018 జూన్‌ 28న ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఉన్నా, ఏడాదికేడాది ఈ సంస్థ మార్కెట్‌ విలువ పెరుగుతూ వస్తోందని తెలిపింది.
  • నివేదికలోని అంశాలు
  • మార్కెట్‌ విలువ భారీగా పెరిగిన సంస్థగా అమెజాన్‌ తొలి స్థానంలో నిలిచింది.
  • 2017తో పోలిస్తే సంస్థ విలువ 66% పెరిగి, 278 బిలియన్‌ డాలర్లకు చేరింది. 
  • తదుపరి స్థానాల్లో  చైనా కంపెనీలు రెండు ఉన్నాయి. టెన్సెంట్‌ విలువ 82% పెరిగి 224 బి.డాలర్లకు, అలీబాబా 76% పెరిగి 201 బి.డాలర్లు చేరడంతో, రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 
  • తరవాత మూడు స్థానాల్లో అమెరికా కంపెనీలైన మైక్రోసాఫ్ట్‌, ఆల్ఫాబెట్‌, యాపిల్‌ ఉన్నాయి.
  • వీటి తరవాత స్థానాల్లో పింగ్‌ యాన్‌ ఇన్సూరెన్స్‌, ఐసీబీసీ, బోయింగ్‌, బెర్క్‌షైర్‌ హాథవే టాప్‌-10 జాబితాలో చోటు దక్కించుకొన్నాయి. 
  • గత ఏడాది జాబితాలో అమెరికా కంపెనీలు 55 ఉండగా, ఈసారి ఆ సంఖ్య 54కు పరిమితమైంది.
  • అలాగే మార్కెట్‌ విలువ పరంగా 63 శాతం నుంచి 61 శాతానికి పడిపోయింది. 
  • 2017తో పోలిస్తే చైనా కంపెనీ మార్కెట్‌ విలువ 57 శాతం పెరిగింది.
  • జాబితాలో 10 సంస్థలు చోటు దక్కించుకోగా ఈసారి 12కు పెరిగింది. హాంకాంగ్‌ కంపెనీ గత ఏడాది ఒకటి ఉండగా, ఈసారి ఆ సంఖ్య రెండుకు చేరింది. 
  • భారతీయ కంపెనీ ఒక్కటి కూడా టాప్‌-100 జాబితాలో చోటు దక్కించుకోలేదు.
టాప్‌-10 కంపెనీలు
1    అమెజాన్‌ 
2    టెన్సెంట్‌         
3    అలీబాబా        
4    మైక్రోసాఫ్ట్‌    
5    ఆల్ఫాబెట్‌    
6    యాపిల్‌         
7    పింగ్‌ యాన్‌ ఇన్సూరెన్స్‌
8    ఐసీబీసీ
9    బోయింగ్‌
10    బెర్క్‌షైర్‌ హాథ్‌వే 

views: 933



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams