Current Affairs Telugu Daily

థామ్సన్‌ రాయిటర్స్‌ ఫౌండేషన్స్‌ నివేదికను తప్పుపట్టిన భారత్ 
మహిళల భద్రతకు సంబంధించి థామ్సన్‌ రాయిటర్స్‌ ఫౌండేషన్స్‌ నివేదికను కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి మేనకా గాంధీ తప్పుపట్టారు. సరైన విధి విధానాలు పాటించకుండా రాయిటర్స్ దీన్ని విడుదల చేసిందన్నారు. ఆరు ప్రశ్నల ఆధారంగా దేశంలో పరిస్థితిని అంచనా వేయడం సరికాదన్నారు. థామ్సన్‌ రాయిటర్స్‌ ఫౌండేషన్స్‌ నిర్వహించిన సర్వే భారత్ లో మహిళల పరిస్థితి గురించి విస్మయకర విషయాలు వెల్లడించింది. మహిళలకు అత్యంత ప్రమాదకర దేశం భారత్ అని అందులో పేర్కొంది. 
views: 1016

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams