Current Affairs Telugu Daily

సోయాబీన్‌, ఇతర ఉత్పత్తులపై చైనా సుంకాల తగ్గింపు
భారత్‌ సహా మరో 4 ఆసియా దేశాల నుంచి వెళ్లే సోయాబీన్‌, కొన్ని ఇతర వస్తువులపై చైనా దిగుమతి సుంకాల్లో కోత విధించింది. 2018 జులై 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని చైనా కేబినెట్‌ ప్రకటించింది. అమెరికాతో వాణిజ్య యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం వెలువడింది.  భారత్‌, దక్షిణ కొరియా, బంగ్లాదేశ్‌, లావోస్‌, శ్రీలంక దేశాల నుంచి దిగుమతి అయ్యే సోయాబీన్‌పై సుంకాన్ని 3 శాతం నుంచి సున్నాకు తగ్గించినట్లు చైనా ప్రభుత్వం వెల్లడించింది.  చైనాకు దిగుమతి అయ్యే అధిక శాతం సోయాబీన్స్‌ అమెరికా నుంచే వస్తున్నాయి. వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సోయాబీన్‌పై దిగుమతి సుంకాన్ని చైనా తగ్గించింది.
views: 1120



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams