Current Affairs Telugu Daily

తెలంగాణ వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షుడిగా జస్టిస్‌ జైశ్వాల్‌ 
తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షుడిగా హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.కె.జైశ్వాల్‌ నియమితులయ్యారు. జస్టిస్‌ జైశ్వాల్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఐదేళ్లు, లేదా 67 ఏళ్లు వచ్చేవరకు కొనసాగుతారు. 1956 ఫిబ్రవరి 5న జస్టిస్‌ జైశ్వాల్‌ హైదరాబాద్‌లో జన్మించారు. సికింద్రాబాద్‌లోని మహబూబ్‌ కళాశాల నుంచి 1971లో ఎస్‌ఎస్‌సీలో ఉత్తీర్ణత పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తిచేశారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా సేవలు అందించి 2018 ఫిబ్రవరి 4న పదవీ విరమణ చేశారు.
views: 1107

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams