Current Affairs Telugu Daily

టర్కీ అధ్యక్షుడిగా మరోసారి రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ 
టర్కీ అధ్యక్షుడిగా రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌ మరోసారి ఎన్నికయ్యారు. దేశాధ్యక్ష పదవికి 2018 జూన్‌ 24న నిర్వహించిన ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. ఎర్డోగన్‌కు 52.5 శాతం ఓట్లు వచ్చాయని.. ఆయన ప్రధాన ప్రత్యర్థి ముహర్రెమ్‌ ఇన్సె(రిపబ్లికన్‌ పీపుల్స్‌ పార్టీ) కేవలం  30.7 శాతం ఓట్లు దక్కించుకున్నారని ప్రభుత్వరంగ వార్తాసంస్థ ‘అనడొలు’ వెల్లడించింది. పార్లమెంటరీ ఎన్నికల్లోనూ ఎర్డోగన్‌ పార్టీ ‘జస్టిస్‌ అండ్‌ డెవప్‌మెంట్‌ పార్టీ(ఏకేపీ)’ విజయం సాధించింది. పార్లమెంటులో మొత్తం 600 స్థానాలకుగాను 293 సీట్లు గెలుచుకుంది. ఏకేపీ మిత్రపక్షం ‘నేషనలిస్ట్‌ మూవ్‌మెంట్‌ పార్టీ(ఎంహెచ్‌పీ)’ 50 స్థానాలు దక్కించుకుంది. దీంతో ఏకేపీ-ఎంహెచ్‌పీ కూటమికి పార్లమెంటులో స్పష్టమైన ఆధిక్యం లభించింది. 
views: 988

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams