Current Affairs Telugu Daily

తెలంగాణకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ పురస్కారాలు
స్వచ్ఛ సర్వేక్షణ్‌-2018 కింద ఘన వ్యర్థాల నిర్వహణలో హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. 2018 జూన్‌ 23న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి నుంచి మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
  • సిద్దిపేట దక్షిణాదిలో ఉత్తమ స్వచ్ఛ పట్టణంగా పురస్కారం పొందింది. ఈ పురస్కారాన్ని సిద్దిపేట కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి పొందారు.
  • బోడుప్పల్‌ పురపాలక సంఘం ప్రజల మన్ననలు పొందిన పట్ణణం కేటగిరిలో ఉత్తమ పురస్కారం పొందింది. అరవింద్‌కుమార్‌, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిలు దీనిని స్వీకరించారు.
  • స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జాతీయస్థాయి ఉత్తమ నగరాల జాబితాలో జీహెచ్‌ఎంసీ 27, వరంగల్‌ 31, సూర్యాపేట 45వ స్థానం పొందాయి.
  • ఉత్తమ రాష్ట్రాల ర్యాంకుల్లో తెలంగాణ 7వ స్థానంలో నిలిచింది.

views: 1090

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams