Current Affairs Telugu Daily

మంగళంపల్లి బాలమురళీకృష్ణ అవార్డు రూ.10 లక్షలు
ప్రముఖ సంగీత విద్యాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ పేరిట ఏటా ఇస్తున్న పురస్కార నగదును ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఈ బహుమతి మొత్తాన్ని లక్ష రూపాయలు నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ 2018 జూన్‌ 22న ఉత్తర్వులు జారీ చేసింది.
  • బాలమురళీకృష్ణ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం జూలై 6న ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతకు నగదు పురస్కారం, మెమోంటో అందించి శాలువాతో సత్కరిస్తారు.
  • ఈ నగదు బహుమతిని రూ.10 లక్షలు చేయనున్నట్టు గత ఏడాది బాలమురళీకృష్ణ జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాలతో పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ చర్యలు తీసుకొంది.

views: 1136

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams