Current Affairs Telugu Daily

సైగల గొరిల్లా ‘కోకో’ మృతి
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోకో(గొరిల్లా) తన 46వ ఏట కన్నుమూసింది. 2018 జూన్‌ 21న కోకో మృతిని ‘గొరిల్లా పౌండేషన్‌’ ప్రతినిధులు ధ్రువీకరించారు. సైగల భాషతో తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న కోకో గోరిల్లా అంబాసిడర్‌గా ఓ వెలుగు వెలిగింది.
  • హనబీ కో( కోకో అసలు పేరు)1971 జూలై 4న శాన్‌ ఫ్రాన్సిస్కోలోని ఓ జూలో జన్మించింది.
  • 12నెలల ప్రాయంలో స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శీటీకి చెందిన ఫ్రాన్సిన్‌ పాటర్‌సన్‌ అనే విద్యార్థి చొరవతో సైగల భాషను నేర్చుకుంది. కోకో దాదాపు 1000 రకాల సైగలనే కాకుండా ఇంగ్లీష్‌ పదాలను సైతం అర్థం చేసుకుంటుంది.
  • 1983 సంవత్సరంలో మొట్టమొదటి సారిగా ఓ పిల్లి పిల్లలు కావాలని అడగటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
  • 1985న కోకో పుట్టిన రోజు సందర్భంగా  కొన్ని పిల్లులను తెచ్చి ఎంపిక చేసుకోవల్సిందిగా కోరారు. వాటిలో బూడిద, తెలుపు రంగులో ఉన్న ఓ పిల్లి పిల్లలను ఎంపిక చేసుకోవటమే కాకుండా దానికి ఆల్‌ బాల్‌ అనే పేరు పెట్టింది. కన్న తల్లిలాగా దానికి సేవలు కూడా చేసేది. ఓ కారు ప్రమాదంలో ఆల్‌ బాల్‌ మృతిచెందటంతో కోకో కృంగిపోయి కొద్ది రోజులు ఏడుస్తూ ఉండిపోయింది.
  • నేషనల్‌ జియోగ్రఫీ బుక్‌ కవర్‌ పేజీపై రెండు సార్లు కనిపించటమే కాకుండా మరికొన్ని డాక్యుమెంటరీలో కూడా కనిపించింది. సెల్ఫీ తీసుకోవటం, ఇంటర్‌నెట్‌లో చాట్‌ చేయటం వంటి పనులతో అందరి దృష్టిని ఆకర్షించింది. 

views: 1004

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams