Event-Date: | 10-Jun-2017 |
Level: | National |
Topic: | Miscellaneous(General) |
పి-75(1) కార్యక్రమం కింద ఈ ప్రాజెక్టును చేపట్టడానికి ప్రయివేటు సంస్థలైన లార్సన్ అండ్ టుబ్రో, రిలయన్స్‌లతో పాటు ప్రభుత్వ రంగ సంస్థ అయిన మజగాన్ డాక్ లిమిటెడ్‌లు ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. విదేశీ తయారీదార్లను కూడా ఆహ్వానించాలని కేంద్రం భావిస్తోంది. నౌకాదళం కోసం పి-75 కింద ఇటీవల ఆరు స్కార్పెనే తరగతి జలంతర్గాములను నిర్మించారు. ఫ్రాన్స్‌కు చెందిన డీసీఎన్ఎస్ కంపెనీ సహకారంతో ముంబయిలోని మజగాన్ డాక్లో తయారు చేశారు. దానికి కొనసాగింపుగా పి-75(1)ను చేపట్టనున్నారు. ఇందులో ప్రయివేటు సంస్థలకు అవకాశం కలిగించనుండడం విశేషం. అవి 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను స్వీకరించే అవకాశం కూడా ఉంది. పరికరాల అసలు తయారీదార్ల నుంచి సాంకేతిక సహకారం కూడా పొందవచ్చు. అయితే సంస్థ నిర్వహణ మాత్రం భారతీయ కంపెనీల చేతిలో ఉంటుంది.