Current Affairs Telugu Daily

CRDA బాండ్లకు క్రిసిల్‌ ఎం రేటింగ్‌ 
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణ ప్రాజెక్టుకు ఇన్వెస్టర్ల నుంచి నిధులు సమీకరించేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(CRDA) విడుదల చేయనున్న బాండ్లకు ప్రముఖ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ ఎం రేటింగ్‌ ఇచ్చింది. రాజధాని బాండ్లలో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించేందుకు క్రిసిల్‌ రేటింగ్‌ ఉపయోగపడుతుందని CRDA వర్గాలు భావిస్తున్నాయి.
  • ఈ బాండ్ల ద్వారా రూ.రెండు వేలు కోట్ల వరకు సమీకరించాలని CRDA లక్ష్యంగా పెట్టుకుంది.
  • ఈ బాండ్లకు సంబంధించి CRDA లోగడే బ్రిక్‌వర్క్‌, స్మెరా సంస్థలతో రేటింగ్‌ ప్రక్రియ నిర్వహించింది. ఆ రెండు సంస్థలు ఏఏ- రేటింగ్‌ ఇచ్చాయి.
  • క్రిసిల్‌ వంటి అగ్రశ్రేణి సంస్థ రేటింగ్‌ ఉంటే బాండ్లకు మార్కెట్‌లో మరింత ఆకర్షణ పెరుగుతుందన్న నిపుణుల సూచన మేరకు ఆ ప్రక్రియనూ CRDA పూర్తి చేసింది. సీఆర్‌డీఏ విడుదల చేసే బాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం హామీనిస్తోంది.
CRDA-Capital Region Development Authority

views: 946

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams