Current Affairs Telugu Daily

భారత తొలి రోబోటిక్‌ టెలిస్కోపు ప్రారంభం
భారత తొలి రోబోటిక్‌ టెలిస్కోపు తన సేవలను ప్రారంభించింది. ఇండియన్‌ ఆస్ట్రోనోమికల్‌ అబ్జర్వేటరీ(ఐఏవో) అనే టెలిస్కోపును లద్దాఖ్‌లో ఏర్పాటు చేశారు. ఇది 2018 జూన్‌ 12న తొలిసారిగా రాత్రివేళ ఆకాశాన్ని వీక్షించిందని ఈ కేంద్రం అధిపతి జి.సి.అనుపమ వెల్లడించారు. సమీపంలోని దేదీప్యమాన ఖగోళ వస్తువులతో కూడిన ‘మెస్సియర్‌ క్యాటలాగ్‌’ నుంచి కొన్ని లక్ష్యాను ఎంపిక చేసి, వాటిపైకి ఈ టెలిస్కోపు దృష్టిని మళ్లించినట్లు తెలిపారు.
  • ఈ ప్రాజెక్టులో అమెరికా, బ్రిటన్‌, జపాన్‌, జర్మనీ, తైవాన్‌, ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు కూడా భాగస్వామ్యం వహించారు.
  • రూ.3.5 కోట్లతో ఏర్పాటైన ఈ టెలిస్కోపును బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌, బొంబాయి ఐఐటీలు సంయుక్తంగా నిర్మించాయి.
  • దీని ద్వారా ఏటా 1000 గిగాబైట్ల డేటా వెలువడుతుందని అంచనా వేస్తున్నారు.

views: 1001



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams