Current Affairs Telugu Daily

‘ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు-2018’ నివేదిక
ప్రపంచవ్యాప్తంగా ఆకలి కేకలు పెరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. దాదాపు దశాబ్దకాలానికిపైగా తగ్గుతూ వచ్చిన అన్నార్థుల సంఖ్యలో తొలిసారిగా ఇటీవల పెరుగుద కనిపించినట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లేమితో బాధపడుతున్నవారి సంఖ్య 2015లో 77.7 కోట్లుగా ఉండగా 2016 నాటికి మరో 3.8 కోట్లు పెరిగి 81.5 కోట్లకు చేరుకుందని తెలిపింది. ‘ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు-2018’ పేరుతో తాజా నివేదిక విడుదలైంది.
  • ఘర్షణలు, కరవు, విపత్తుల కారణంగా పర్యావరణంలో వస్తున్న మార్పులతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనపై ప్రతికూల ప్రభావం పడుతోందని నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడుతుండటానికి ఇవే ప్రధాన కారణాలని పేర్కొంది.
  • ఘర్షణల కల్లోలంతో 18 దేశాల్లో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నట్లు వెల్లడించింది. హింసాత్మక ఘర్షణల కారణంగా 2017లో 6.85 కోట్ల మంది తప్పనిసరి పరిస్థితుల్లో వలసబాట పట్టారని తెలియజేసింది.
  • సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు 2030ని తుది గడువుగా నిర్దేశించుకున్న సంగతిని గుర్తుచేసింది. అందుకు కేవలం 12 ఏళ్లే మిగిలి ఉండటంతో.. లక్ష్యాలను చేరుకునే దిశగా ముమ్మర కృషి చేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది.
  • ప్రకృతి విపత్తులతో 2017లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 బిలియన్‌ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లింది. 
  • భారత్‌ సహా దక్షిణాసియా మొత్తంగా బాల్య వివాహాలు 2000-2017 మధ్య 40 శాతం తగ్గాయి. దక్షిణాసియావ్యాప్తంగా నీటి కొరత మాత్రం పెరుగుతోంది. 
  • ప్రపంచవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి 10 మందిలో 9 మంది కలుషిత గాలినే పీల్చుకుంటున్నారు. దక్షిణాసియాలో ఈ పరిస్థితి విషమంగా ఉంది.

views: 940

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams