Current Affairs Telugu Daily

రాజధానిలో శ్రీ భూసమేత దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రారంభం
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో అధునాతనంగా నిర్మించిన 11 అడుగుల ఎత్తైన శ్రీ భూసమేత దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2018 జూన్‌ 22న ప్రారంభించారు.
  • గుంటూరు జిల్లా నంబూరులో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న రెయిన్‌ ట్రీ పార్కు ప్రాంగణంలో లింగమనేని ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఈ దేవాలయాన్ని నిర్మించింది.
  • ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠాపన, ధ్వజస్తంభం, రాజగోపురం ప్రతిష్ఠాపనలో ముఖ్యమంత్రితో పాటు జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ పాల్గొన్నారు.
  • దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి వారిద్దరితో పూజలు చేయించారు. 

views: 972

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams