Current Affairs Telugu Daily

టాప్‌-100 ప్రభావశీల వ్యక్తుల్లో బిలిమోరియా
భారత్‌-బ్రిటన్‌ బంధాలను ప్రభావితం చేసిన టాప్‌ 100 మంది ప్రముఖుల్లో ఎన్‌ఆర్‌ఐ వ్యాపారవేత్త, యూనివర్సిటీ ఆఫ్‌ బర్మింగ్‌హామ్‌ చాన్స్‌ర్‌ లార్డ్‌ కరణ్‌ బిలిమోరియాకు చోటుదక్కింది.
  • ఆయనతోపాటు ఇదే వర్సిటీ అసిస్టెంట్‌ వైస్‌ చాన్స్‌ర్‌ ప్రొఫెసర్‌ రాబిన్‌ మాసన్‌ కూడా ఈ జాబితాలలో ఉన్నారు.
  • యూకే-ఇండియా వీక్‌ 2018లో భాగంగా ‘ఇండియా ఐఎన్‌సీ. టాప్‌ 100’ పేరుతో విడుదలైన ఈ జాబితాలో భారత్‌, బ్రిటన్‌ల్లో వివిధ రంగాల్లో పేరుప్రఖ్యాతలు గడించిన పలువురు వ్యక్తులు ఉన్నారు.
  • హైదరాబాద్‌లో జన్మించిన కరణ్‌ బిలిమోరియా బ్రిటన్‌లో ప్రఖ్యాత కోబ్రా బీర్‌ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరు.
  • బ్రిటన్‌లోని అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల మండలి అధ్యక్షుడిగా, యూకే-ఇండియా వాణిజ్య మండలి వ్యవస్థాపక చైర్మన్‌గా ప్రస్తుతం పనిచేస్తున్నారు.

views: 1097

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams