Current Affairs Telugu Daily

దేశాధినేత హోదాలో ఉండి బిడ్డకు జన్మనిచ్చిన రెండో మహిళగా న్యూజిలాండ్‌ ప్రధాని
న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డర్న్‌ 2018 జూన్‌ 20న ఆడబిడ్డకు జన్మనిచ్చారు.
  • దేశాధినేత హోదాలో ఉండి బిడ్డకు జన్మనిచ్చిన రెండో మహిళగా ఆర్డర్న్‌ రికార్డుకెక్కారు.
  • 37 ఏళ్ల జెసిండా, 40 ఏళ్ల క్లార్క్‌ గెఫోర్డ్‌ దంపతులకు ఈ పాప మొదటి సంతానం. పాకిస్తాన్‌ ప్రధాని బెనజీర్‌ భుట్టో 1990లో అధికారంలో ఉండగా బిడ్డకు జన్మనిచ్చిన తొలి మహిళగా చరిత్రకెక్కారు.
  • లేబర్‌పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మూడు నెలలకు 2017 అక్టోబర్‌లో ఆర్డర్న్‌ ప్రధాని అయ్యారు.
  • న్యూజిలాండ్‌ రాజధాని - వెల్లింగ్టన్‌

views: 1081

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams