తెలంగాణ రేషన్ పోర్టబిలిటీ  
పేద ప్రజలకు సులభంగా సబ్సిడీ సరుకులు అందచేయాలనే లక్ష్యంతో చేపట్టిన పోర్టబిలిటీ విధానం నగర పేదలకు వరంగా మారింది. నగరంలో ఎక్కడైనా రేషన్ సరుకులు పోందే వీలు కల్పించడంతో ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. గ్రేటర్ పరిధిలోని మూడుజిల్లాలో ఈ విధానం అమల్లోకి తెచ్చినప్పటికీ హైదరాబాద్ జిల్లా పోర్టబిలిటీలో టాప్‌లో నిలిచింది. జూన్ 1 నుంచి మొదలైన పోర్టబిలిటీ కేవలం వారం రోజుల్లోనే అప్రతిహాతంగా పుంజుకుంది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్,రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు కలిపి కేవలం వారం రోజుల్లో 3,154 మంది పోర్టబిలిటీనీ ఉపయోగించుకున్నారు. ఈ అవకాశం ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికి, అద్దె ఇండ్లలో ఉంటూ తరుచూ నివాసాన్ని మార్చుతున్నవారితోపాటు తమ నివాసాలకు దూరంగా దుకాణాలు కేటాయింపబడ్డ లబ్ధిదారులకు పోర్టబిలిటీ విధానం అత్యంత ప్రయోజనకరంగా ఉంది. 
views: 811

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams