Current Affairs Telugu Daily

వలస కుటుంబాల నుంచి చిన్నారులను వేరు చేసే పద్ధతికి అమెరికా స్వస్తి 
అక్రమంగా వలస వచ్చిన కుటుంబాల నుంచి చిన్నారులను వేరు చేసే దారుణ పద్ధతికి అమెరికా స్వస్తి పలికింది.
  • ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 2018 జూన్‌ 21న ఒక కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు.
  • వేరు చేసిన చిన్నారులను బోనుల్లో ఉంచిన ఫొటోలపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహజ్వాల వ్యక్తంకావడంతో ఆయన ఈ చర్యకు ఉపక్రమించారు. 
  • చిన్నారి సంక్షేమానికి తల్లిదండ్రుల వల్ల ముప్పు ఎదురవుతుందనుకున్న కేసును కార్యనిర్వాహక ఉత్తర్వుల నుంచి మినహాయించారు. 

views: 919

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams