మైక్రో ఇన్ఫో గ్లోబల్-స్కైరెక్ సంస్థ మధ్య చిల్లర వర్తకం పరిశ్రమ అభివృద్ధి ఒప్పందం
తైవాన్‌లో 2018 జూన్ 21న తయోవాన్-భారత్ ఎక్స్ఛేంజి సదస్సు జరిగింది.
ఇందులో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో పాటు పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, ఎలక్ట్రానిక్స్ సంచాలకుడు సంజయ్ కారంపురి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జోషి, జయేశ్ రంజన్ సమక్షంలో భారత్‌కు చెందిన మైక్రో ఇన్ఫో గ్లోబల్, తైవాన్‌లోని స్కైరెక్ సంస్థ మధ్య చిల్లర వర్తకం పరిశ్రమ అభివృద్ధికి ఒప్పందం జరిగింది.
దీనిపై మైక్రో ఇన్ఫో గ్లోబల్ ఛైర్మన్ అప్పిరెడ్డి, స్కైరెక్ ప్రాజెక్టు డైరెక్టర్ జాన్సన్‌లు సంతకాలు చేశారు.
పదిహేనేళ్లుగా కృతిమ మేథ రంగంలో ఉన్న స్కైరెక్ ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా సంస్థలకు సాంకేతిక సాయాన్ని అందిస్తోంది.
ఈ ఒప్పందం ద్వారా ఈ సంస్థ భారత్‌లోకి ప్రవేశించింది.