Current Affairs Telugu Daily

సింగరేణి యోగా రికార్డు
ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి వ్యాప్తంగా 1.26 లక్ష మంది సామూహిక యోగా కార్యక్రమాల్లో పాల్గొని కొత్త రికార్డును సృష్టించారు.
  • గతేడాది 176 కేంద్రాల్లో 60,369 మందితో సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించి లిమ్కా బుక్‌ఆఫ్‌ రికార్డ్స్‌లో సింగరేణి స్థానం సాధించింది.
  • ఇప్పుడు దాన్ని తిరగరాసింది.
  • తెలంగాణ 6 జిల్లాల్లోని 11 ఏరియాల్లో గను, విభాగాలు, కార్యాలయాలు, మైదానాలు ఈ రికార్డుకు వేదికగా మారాయి.
  • దీన్ని విజయవంతం చేసేందుకు యాజమాన్యం కొద్దిరోజుల నుంచి కంపెనీ వ్యాప్తంగా విసృత ప్రచారం నిర్వహించగా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, కార్మికేతరుల నుంచి మంచి స్పందన లభించింది.
  • 2018 జూన్‌ 21న ఉదయం 11 గంటల వరకు 81,825 మంది, సాయంత్రం 44,251 మంది మొత్తంగా 1,26,076 మంది సామూహిక యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 
సింగరేణి సీఎండీ- ఎన్‌.శ్రీధర్‌ 

views: 1002

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams