Current Affairs Telugu Daily

ఓర్వకల్లు, దగదర్తి విమానాశ్రయాలకు పర్యావరణ అనుమతులు
కర్నూలు జిల్లా ఓర్వకల్లు, నెల్లూరు జిల్లా దగదర్తి మండలాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయాలకు కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది.భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నేతృత్వంలో ఈ విమానాశ్రయాల నిర్మాణం జరుగుతుంది. నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలోని దామవరం, కేకే గుంట గ్రామాల పరిధిలోని 584 ఎకరాల్లో రూ.460 కోట్లతో విమానాశ్రయం నిర్మించనున్నారు.కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కన్నమడకల, పూడిచెర్ల గ్రామాల పరిధిలోని 583 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం నిర్మిస్తారు.
views: 1427

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams