Current Affairs Telugu Daily

జాతీయ ఆరోగ్య వనరుల నిధి ప్రారంభం
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఆరోగ్య పరిరక్షణ సంస్థలన్నింటిలో లభ్యమయ్యే వివరాలతో కూడిన ‘జాతీయ ఆరోగ్య వనరుల నిధి’ (నేషనల్‌ హెల్త్‌ రీసోర్సెస్‌ రిపాజిటరీ-NHRR))ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జె.పి.నడ్డా 2018 జూన్‌ 19న ప్రారంభించారు.
  • ఈ సమాచార నిధి ఆధారంగా మున్ముందు ఆరోగ్య పరిరక్షణ సవాళ్లపై అధునాతన పరిశోధన జరిగేందుకు ఆస్కారం ఉంటుంది.
  • ఇలాంటిది రావడం దేశంలో ఇదే తొలిసారి.
  • ప్రామాణీకరించిన అధీకృత సమాచారాన్ని దీనిలో పొందుపరుస్తారు.
  • రైల్వే, ఈఎస్‌ఐ, రక్షణ రంగ వైద్య సంస్థకు చెందిన సమాచారంతో పాటు అన్నీ దీనిలో లభిస్తాయి.
  • సమాచార సేకరణ కోసం 4000 మంది సుశిక్షితులైన నిపుణులు పనిచేస్తారు.
  • దీనికి సాంకేతిక భాగస్వామిగా ఇస్రో వ్యవహరిస్తుంది.
  • 20 లక్షలకు పైగా ఆసుపత్రులు, క్లినిక్‌లు, రోగ నిర్థరణ కేంద్రాలు, ఔషధశాలలు, నర్సింగ్‌హోంల నుంచి 1400 అంశాలపై సమాచారాన్ని సేకరిస్తారు.
  • ఆరోగ్య సేవల్లో ఎక్కడెక్కడ లోపలున్నాయో, ఏయే అంశాల్లో మెరుగుపడాల్సి ఉందో గుర్తిస్తారు.
  • జాతీయ ఆరోగ్య కరదీపికలను కూడా నడ్డా విడదల చేశారు.
NHRR-National Health Resource Repository

views: 818

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams