‘సుమత్రా ఒరంగుటాన్’ జాతిలోనే అత్యంత వృద్ధురాలిగా రికార్డు సాధించిన ప్వాన్ అనే 62 ఏళ్ల వానరం 2018 జూన్ 18న ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో గల ఓ జంతు ప్రదర్శనలో మృతి చెందింది.
ప్వాన్కు 11 పిల్లలు.
వాటి ద్వారా మరో 54 కోతులు కూడా దాని సంతతిలో చేరాయి.
ప్రపంచవ్యాప్తంగా వివిధ జంతు ప్రదర్శనశాలు, అడవుల్లో ఇవి ఉన్నాయి.
ఇండోనేసియాలోని సుమత్రా దీవిలో ఈ అరుదైన సుమత్రా ఒరంగుటాన్లు కనిపిస్తాయి.