Current Affairs Telugu Daily

చిన్నారులపై నేరాల నివారణపై హ్యాండ్‌బుక్‌ ఆవిష్కరణ 
చిన్నారులపై నేరాల నివారణ, ఆయా కేసుల్లో అనుసరించాల్సిన ప్రక్రియ, సంబంధిత చట్టాలు, న్యాయస్థానాల తాజా తీర్పులను సమగ్రంగా సంకలనం చేసిన హ్యాండ్‌బుక్‌ను కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ 2018 జూన్‌ 19న న్యూదిల్లిలో ఆవిష్కరించారు.
  • ప్రతి పోలీసు స్టేషన్‌లోనూ ఇది అందుబాటులో ఉండేలా తమ మంత్రిత్వశాఖ చర్యలు చేపడుతుందని మేనకాగాంధీ తెలిపారు.
  • ప్రధానంగా స్థానిక భాషల్లో అందుబాటులో ఉండేలా చూడనున్నట్లు చెప్పారు.
  • చిన్నారులపై నేరాల విషయంలో అనుసరించాల్సిన ప్రక్రియను వివరిస్తున్న ఈ పుస్తకం పోలీసు సిబ్బందికి కరదీపికగా నిలుస్తుంది.
  • బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రిసర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌(BPRD), టాటా ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(TISS)దీనిని సంకలనం చేశాయి.
BPRD-Bureau of Police Research and Development
TISS-Tata Institute of Social Sciences

views: 842



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams