Current Affairs Telugu Daily

ఫోర్బ్స్‌ ప్రపంచ కుబేరుల జాబితాలలో జెఫ్‌ బెజోస్‌కు అగ్రస్థానం 
ఫోర్బ్స్‌ ప్రకటించిన ప్రపంచ కుబేరుల జాబితాలో అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ తొలి స్థానాన్ని దక్కించుకున్నారు.
  • 141.9 బిలియన్‌ డాలర్ల (దాదాపు 9.5 లక్ష కోట్లు) సంపదతో అగ్రస్థానంలో నిలిచారు.
  • ఆ తరవాత స్థానంలో మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ ఉన్నారు.
  • ఈయన సంపద విలువ 92.9 బి.డాలర్లు.
  • మార్కెట్‌ మాంత్రికుడు వారెన్‌ బఫెట్‌ 82.2 బి.డాలర్ల సంపదతో మూడో స్థానం సంపాదించారు.
  • ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా అమెజాన్‌ రెండో స్థానంలో నిలిచింది.
  • యాపిల్‌ మొదటి స్థానంలో ఉంది.
  • 2018 ప్రారంభంలో విడుదల చేసిన ఫార్చ్యూన్స్‌ జాబితాలలో 177.87 బి.డాలర్ల ఆదాయంతో అమెజాన్‌ 8వ స్థానంలో నిలిచింది.
  • ఇప్పుడు ఫోర్బ్స్‌ జాబితాలో అనూహ్యంగా రెండో స్థానానికి ఎగబాకింది. 
  • అమెజాన్‌ ఏర్పాటు -1994 జులై 5
  • అమెజాన్‌ ప్రధాన కార్యాయం - సీటెల్‌, వాషింగ్టన్‌, అమెరికా

views: 997



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams