Current Affairs Telugu Daily

చైనా పర్యటనలో కిమ్‌ జోంగ్‌ ఉన్‌ 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఇటీవల చరిత్రాత్మక భేటీలో పాల్గొన్న ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తాజాగా చైనా పర్యటనకు వెళ్లారు.
  • చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ఆయన సమావేశమయ్యారు.
  • కొరియా ద్వీపకల్పాన్ని అణ్వాయుధరహితంగా మార్చేందుకు ట్రంప్‌తో భేటీలో అంగీకరించిన నేపథ్యంలో.. తదుపరి కార్యాచరణ ప్రణాళికపై జిన్‌పింగ్‌తో కిమ్‌ చర్చించినట్లు తెలుస్తోంది.
  • 2018 మార్చి నుంచి కిమ్‌ చైనాలో పర్యటిస్తుండటం ఇది మూడోసారి.
  • ప్రస్తుతం అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం తరహా పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కిమ్‌ తాజా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.
  • చైనా అధ్యక్షుడు- జీ జిన్‌పింగ్‌
  • చైనా రాజధాని- బీజింగ్‌
  • చైనా కరెన్సీ - యువాన్‌
  • ఉత్తర కొరియా అధినేత - కిమ్‌ జోంగ్‌ ఉన్‌
  • ఉత్తర కొరియా రాజధాని- ప్యాంగ్‌యాంగ్‌ 

views: 853

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams