Current Affairs Telugu Daily

గ్రహానికి విద్యార్థిని పేరు
ఈ మధ్యకాలంలో బెంగళూరులోని చెరువుల్లో నురగులు ఉబికి వస్తుండటం.. ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటడం చూస్తూనే ఉన్నాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరస్సులను శుభ్రం చేయలేకపోతున్నారు. బెంగళూరుకు చెందిన ఇన్వెంచర్‌ అకాడమీ అంతర్జాతీయ స్కూల్‌ 12వ తరగతి విద్యార్థిని సాహితీ పింగళి క్రౌడ్‌ సోర్సింగ్‌ ద్వారా నురుగు, కాలుష్య సరస్సుల వివరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ఒక యాప్‌ను రూపొందించింది. దీని కాలుష్య వివరాలను తెలుసుకోగలం. ఇంటర్నేషనల్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ ఫెయిర్‌(ఐఎస్‌ఈఎఫ్‌)లో తాను రూపొందించిన యాప్‌ను సాహితీ ప్రదర్శనకు ఉంచింది. ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్న వారిలో తుదిపోరుకు అర్హత పొందిన 2వేలమందిలో సాహితీ ఒకరు కావడం విశేషం. అంతేకాకుండా టాప్‌3లో స్థానం దక్కించుకోవడంతో పాలపుంతలోని ఓ గ్రహానికి ఆమె పేరును పెట్టాలని లింకన్‌ లాబొరేటరీ ఆఫ్‌ ద మసాచూసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) నిర్ణయించింది. చిన్న గ్రహాలకు పేర్లును పెట్టే హక్కు ఎంఐటీకి ఉంది. ప్రస్తుతం సాహితీ యూనివర్శిటీ ఆఫ్‌ మిచిగాన్‌ సివిల్‌, ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఇంటర్న్‌షిప్‌ చేస్తుంది.
  • పాలపుంతలోని ఓ గ్రహానికి ఆమె పేరును పెట్టాలని లింకన్‌ లాబొరేటరీ ఆఫ్‌ ద మసాచూసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఎంఐటీ) నిర్ణయించింది. చిన్న గ్రహాలకు పేర్లును పెట్టే హక్కు ఎంఐటీకి ఉంది.

views: 825

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams