Current Affairs Telugu Daily

జర్నలిస్టుకు గూగుల్‌ శిక్షణ 
తెలుగు, తమిళంతో పాటు 6 ప్రాంతీయ భాషలు, ఇంగ్లీష్‌ మీడియా జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు గూగుల్‌ ఓ కార్యక్రమం చేపట్టనుంది.
  • నకిలీ వార్త కట్టడి, అసత్య సమాచారానికి అడ్డుకట్ట తదితర అంశాపై దీని ద్వారా అవగాహన కల్పించనుంది.
  • ‘‘ద గూగుల్‌ న్యూస్‌ ఇనీషియేటివ్‌ ఇండియా ట్రైనింగ్‌ నెట్‌వర్క్‌’’ పేరిట ఈ కార్యక్రమం చేపడతామని, దీని ద్వారా ఏడాది కాలంలో 8,000 మంది జర్నలిస్టులకు శిక్షణ ఇస్తామని గూగుల్‌ వెల్లడించింది.
  • దీని కోసం దేశవ్యాప్తంగా భిన్న నగరాల నుంచి 200 మంది జర్నలిస్టులను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తామని, వీరు సెమినార్‌ ద్వారా మిగతావారికి అవగాహన కల్పిస్తారని పేర్కొంది.
  • ఈ సెమినార్లు తెలుగు, తమిళం, బెంగాలీ, మరాఠీ, కన్నడ, హిందీ,ఆంగ్లంలో కొనసాగుతాయని పేర్కొంది.
  • గూగుల్‌ సీఈఓ - సుందర్‌ పిచాయ్‌ (భారతీయుడు)

views: 830

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams