తెలంగాణ పోలీసుల ‘కాప్‌ కనెక్ట్‌’ యాప్‌ ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర పోలీసుశాఖ అంతర్గత అవసరాల కోసం వాట్సప్‌ తరహాలో రూపొందించిన ‘కాప్‌ కనెక్ట్‌’ యాప్‌ను డీజీపీ మహేందర్‌రెడ్డి 2018 జూన్‌ 18న హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.
  • దీని ద్వారా విభాగాల వారీగా, జిల్లాల వారీగా తమ అవసరాలకు తగ్గట్టుగా ప్రత్యేక గ్రూపు ఏర్పాటు చేసుకొని సమాచార మార్పిడి చేసుకోవచ్చు.
  • మామూలు వాట్సప్‌ గ్రూప్‌లో అయితే 256 మందితో మాత్రమే ప్రత్యేక బృందం ఏర్పాటు చేసుకోవడం సాధ్యమవుతుంది.
  • కానీ కాప్‌ కనెక్ట్‌ ద్వారా ఒకేసారి సిబ్బంది మొత్తం అంటే 63వేల మంది ఒకే బృందంగా ఉండవచ్చు.
  • ఇందులో మళ్లీ తమ అవసరాలకు తగ్గట్టుగా ఉప బృందాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
  • ఒకేసారి పదివేల మందితో, వారి స్థానాల నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించేలా మరో ప్రత్యేకమైన యాప్‌ను కూడా డీజీపీ ప్రారంభించారు. 
ఉపయోగాలు 
  • పోలీసుశాఖలో సమాచార మార్పిడి అత్యంత కీలకం. ఎక్కడో నిజామాబాద్‌లో నేరస్థుడు తప్పించుకున్నాడు.
  • మామూలుగా అయితే నేరస్థుడి ఫొటో మెయిల్‌ చేస్తే దాన్ని మళ్లీ అన్ని స్టేషన్లకు పంపి, అక్కడ నుంచి సిబ్బందికి అందజేయాలి.
  • కానీ కాప్‌ కనెక్ట్‌ ద్వారా నేరగాడి ఫొటో క్షణంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సిబ్బంది అందరికీ పంపవచ్చు. ప్రస్తుతమున్న వాట్సప్‌ ద్వారా ఇది సాధ్యంకాదు.
  • కాప్‌ కనెక్ట్‌ ద్వారా డీజీపీ జిల్లాలు, కమిషనర్లకు ఏ సందేశమైనా క్షణంలో ఉన్న సిబ్బంది అందరికీ చేరవేయవచ్చు.
  • పోలీసుశాఖ రికార్డుల్లో ఉన్న ఫోన్‌ నెంబర్లు మాత్రమే అనుసంధానం అవుతాయి. కాబట్టి బయటి వ్యక్తులు ఇందులోకి వచ్చే అవకాశం ఉండదు.

views: 991

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams