Current Affairs Telugu Daily

జీఎస్టీ పన్ను లేని వస్తువులు ఇవే.. 
జులై 1 నుంచి ప్రతిష్టాత్మక వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ లేని వస్తువుల జాబితాను కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఆహార పదార్థాలు, పిండి, పప్పు దినుసులు, తృణధాన్యాలు, గోధుమలు, మైదా, శెనగపిండి, పాలు, కూరగాయలు, తాజా పండ్లు, ఉడికించిన బియ్యం, సాధారణ ఉప్పు, పశువుల దాణా, సేంద్రీయ ఆహార పదార్థాలు, ముడి సిల్కు, ముడి ఉన్ని, జనపనార వస్తువులు, చేతివృత్తుల ద్వారా తయారవుతున్న వ్యవసాయ సామగ్రికి పన్ను మినహాయింపు ఉన్నట్టు మంత్రిత్వశాఖ తెలిపింది. బ్రాండెడ్‌ ఆహార పదార్థాలకు 5శాతం మాత్రమే పన్ను విధిస్తున్నట్టు పేర్కొంది. జీఎస్టీ అమలుతో ప్రస్తుతం కంటే 4 నుంచి 5శాతం ధరలు తగ్గుతాయని అంచనా.
views: 1128

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams