Current Affairs Telugu Daily

నౌకా స్థావరం ఏర్పాటు ప్రాజెక్టులో భారత్‌తో కలిసి ముందుకెళ్లలేమన్న సీషెల్స్‌ 
తమ భూభాగమైన ‘‘అసంప్షన్‌ దీవి’’లో భారత్‌తో కలిసి నౌకా స్థావరాన్ని ఏర్పాటుచేసే ప్రాజెక్టులో ఇక ముందుకు వెళ్లలేమని సీషెల్స్‌ అధ్యక్షుడు డేనీ ఫార్‌ తెలిపారు.
  • భారత్‌ పర్యటనకు కొన్నిరోజుల ముందుగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
  • 2015లో ఇక్కడ భారత ప్రధాని మోడి పర్యటించినప్పుడే ఈ ప్రాజెక్టుపై రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.
  • అప్పటినుంచీ రాజకీయ ఒత్తిళ్లను సీషెల్స్‌ ఎదుర్కొంటూనే ఉంది. దీంతో 2018 మొదట్లో ఒప్పందంలో మార్పు చేశారు.
  • ఇక్కడ నౌకా స్థావరం ఏర్పాటైతే హిందూ మహాసముద్రంలో భారత్‌కు మంచి పట్టు లభిస్తుంది. 

views: 997

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams