Current Affairs Telugu Daily

యూకే విద్యార్థి వీసా సడలింపులో భారత్‌కు దక్కని చోటు 
విద్యాభ్యాసం నిమిత్తం యూకే వచ్చేవారికి వీసాలు ఇచ్చే విషయంలో కొన్ని దేశాలవారికి సడలింపులు ఇవ్వాలని యూకే ప్రభుత్వం నిర్ణయించింది.
  • ‘తక్కువ ముప్పు’ ఉన్నవిగా పేర్కొంటూ చైనా, బెహ్రైన్‌, సెర్బియా వంటి 25 దేశాలను జాబితాలో చేర్చి, భారత్‌ను మాత్రం పేర్కొనలేదు.
  • ఈ మేరకు వలస విధానంలో మార్పుల్ని ప్రతిపాదిస్తూ ముసాయిదాలను పార్లమెంటుకు సమర్పించింది. విద్య, ఆర్థిక స్థాయి, ఆంగ్ల భాషా నైపుణ్యం వంటి విషయాల్లో ఈ దేశాలవారికి తక్కువగా తనిఖీలు ఉంటాయి.
  • 2018 జులై 6వ తేదీ నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తాయి. ఇతర దేశాల విద్యార్థులు యూకేలో చదువుకోవడాన్ని సులభతరం చేయడం ఉద్దేశంగా వీటిని ప్రతిపాదించారు.
  • భారత్‌కు ఈ జాబితాలో చోటు కల్పించకపోవడం వల్ల ముమ్మర తనిఖీలు, పత్రాల సమర్పణ వంటివి భారతీయ విద్యార్థులకు మాత్రం కొనసాగుతాయి. యూకే వస్తున్న విదేశీ విద్యార్థుల్లో భారత్‌ది మూడోస్థానం. 

views: 821

Current Affairs Telugu
e-Magazine
November-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams