Current Affairs Telugu Daily

బాణసంచా కర్మాగారంలో సంభవించిన అగ్నిప్రమాదంలో 22 మంది మృతి 
మధ్యప్రదేశ్‌లోని ఓ బాణసంచా కర్మాగారంలో సంభవించిన అగ్నిప్రమాదంలో 22 మంది మృత్యువాతపడ్డారు. మరో 10 మంది గాయపడ్డారు. బాలాఘాట్‌ జిల్లా కటేరా గ్రామ పరిధిలోని కర్మాగారంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రమాదవశాత్తు చెలరేగిన మంటలు కొద్ది క్షణాల్లోనే విస్తరించాయి. బాణసంచా తయారీ సరకుల పేలుళ్లతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. సహాయక చర్యలను ప్రారంభించిన అగ్నిమాపక సిబ్బంది 20 మంది కార్మికుల మృత దేహాలను వెలికితీశారు. మరో ఇద్దరు గాయాలతో ఆస్పత్రిలో మృతి చెందారు.
views: 855

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams