Current Affairs Telugu Daily

హన్మకొండ అగ్గలయ్య గుట్టపై జైన విగ్రహం లభ్యం
తెలంగాణలోని హన్మకొండలో గల అగ్గలయ్యగుట్టపై కొత్తగా జైన విగ్రహం వెలుగులోకి వచ్చింది.
  • గుట్టపై ఒక గుహలో నాలుగున్నర ఎత్తులో ఉన్న ఈ విగ్రహం కనిపించింది.
  • ఈ విగ్రహం తొమ్మిదో శతాబ్దానికి చెందినదిగా చరిత్రకారులు భావిస్తున్నారు.
  • ధ్యాన ముద్రలో ఉన్న జైనుడి తలపై త్రిస్తర ఛత్రం, ఇరువైపులా పరిచారకులు, కింది భాగంలో ఏనుగు తొండాలు, సింహాలు ఉండటాన్ని బట్టి ఈ విగ్రహం 24వ తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడిదిగా భావిస్తున్నారు.
  • గుహలో ఈ విగ్రహం బయటపడటం ద్వారా ఈ ప్రదేశాన్ని జైనులు తపస్సు కోసం ఉపయోగించుకున్న చోటు కావచ్చని, దీన్ని జైన ఆరామం(జ్ఞాన మందిరం) కూడా కావచ్చని భావిస్తున్నారు.
  • హన్మకొండ చౌరస్తా సమీపంలో పద్మాక్షి, సిద్ధు గుట్టకు ఉత్తరంగా ఉన్న ఈ అగ్గలయ్య గుట్టపై ఉత్తరాభిముఖాన 30 అడుగుల ఎత్తులో ఉల్బణ(అర్ధ) శిల్పం ఇది వరకే ఉన్నది.
  • ఇదే గుట్టపై ఏడు జైన తీర్థంకుల అర్ధశిల్పాలున్నాయి. వీటిలో పార్శ్వనాథున్ని తేలిగ్గా గుర్తించవచ్చు.
  • తలపై ఏడు పడగల సర్పం గొడుగుపట్టి నేలదాక మెలికలు తిరిగి నిలిచి ఉంటుంది.
  • ఈ శిల్పాలు రాష్ట్ర కూటులు, కళ్యాణ చాళుక్యులు పాలించిన 9,10వ శతాబ్దానాటివి.

views: 949



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams