లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో 106వ జాతీయ సైన్స్ కాంగ్రెస్
2019లో జరిగే 106వ జాతీయ సైన్స్ కాంగ్రెస్‌కు జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ) ఆతిథ్యమివ్వనుంది.
2019, జనవరి 3-7 మధ్య జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోడి ప్రారంభిస్తారు. 300 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు, నోబెల్ గ్రహీతలు సహా సుమారు 15 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.
‘ఫ్యూచర్ ఇండియా: సైన్స్ అండ్ టెక్నాలజీ’ అనే థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
వైద్యం, పర్యావరణం, రసాయన శాస్త్రం తదితరాలపై సుమారు 18 ప్లీనరీ సెషన్లు జరుగుతాయి.